Monday, January 7, 2013

మనవాళ్లు వట్టి వెధవాయిలోయి!(వ్యంగ్య రచన)

                                                                                     
                                                                
                                                                                 

  ఇది కన్యా శుల్కం లో గీరీశం అన్న డైలాగ్ అని నేను ఎక్కడో చదివినట్లు గుర్తు. నేనైతే కన్యాశుల్కం చదవలేదు. సినిమా ఏదో వచ్చిందట గాని నేను పుట్టాక అది రాలేదు కాబట్టి దానిని నేను చూడలేదు. కాని మన రాష్ట్రం లో ఒక రాజకీయ పార్టీ ఉంది. దాని నాయకుడు ఒకరు ఈ మద్య సదరు పుస్తకం చదివాడు అట! ఇంకేముంది ఈ వాక్యం ఆయనకు తెగ నచ్చిందట! అసలే ఆయనకు తాము అన్నా, తమ జాతివారు అదేనండి ఆయన మతం వారు అన్నా చాలా గ్రేట్ అని సంపూర్ణ విశ్వాసమట! ఎందుకంటే ఈ దేశం లోని ప్రజలను సుమారు వెయ్యేండ్లు పరిపాలించిన ఘనులు తమ మతం వారని గొప్ప క్రేజ్. అలాగే ఆయనకు ఇంకొక మతం వారన్న కొంచం  గౌరవాభిమానాలున్నాయి అట! ఎందుకంటే తమ వలేనే వారు సుమారు నాలుగు వందలు ఏండ్లు ఈ దేశ ప్రజల్ని పాలించారు అని. మన వాళ్ళు ఎంత వెదవాయిలు కాకపోతే తాము, ఈ దేశాన్ని పరిపాలించి ఉంటారు అని అనుకున్నాడట. అనుకున్నదే తడవుగా ఆయనకి మనవాళ్ళ వెదావాయి తనాన్ని పరీక్షిద్దామని కోరిక పుట్టిందట. అంతే దానిని అమలు చేసేశాడు.

  ఆయన తమ రాజకీయ పార్టీ మీటింగుల్లో మన మత విశ్వాసాలను ఏకిపారేశాడు. ఏకేసి ఏమి జరుగుతుందో చూదామని లండన్ వెళ్ళాడు. ఇక్కడ ఆయనకు ఒక చిన్న డౌట్ వచ్చిందట. కన్యాశుల్కం  అనేది ఎప్పుడో రాసారు. అప్పటి బుద్దులే మనకు ఇప్పటికి ఉన్నాయా అని? ఎందుకంటే ఈ మద్యనే వారి పార్టీ పెద్దలు ఒక రచయిత్రి వారి మతాన్ని ఏదో కించపరుస్తూ వ్యాక్యలు రాసిందని, ప్రెస్ మీటింగులో స్త్రీ అని కూడ చూడకుండా కొట్టారు. మరి అది చూసి మన వారు కూడ ఏమన్నా  వారి నుంచి నేర్చుకున్నారా అని అను మానం కలిగి ముందు జాగర్త చర్యగా లండన్  వెళ్లాడు . కాని ఆయన అనుమానించినట్లూ ఇక్కడ పెద్దగా స్పందన కనిపించలేదు. ఏవో కేసులు అవి పెట్టారు కాని హీందువులు ఆయన అనుమానించినంతగా ఆవేశ పడలేదు.

  దీనిటో మన వాళ్ళు ఖచ్చితంగా కన్యాశుల్కం బాపతెనని,అప్పటికి,ఇప్పటికి ఏ మార్పు రాలేదని నమ్మకం కుదిరి హాయిగా లండన్ నుండి హైద్రాబద్ కి వచ్చి తమ పార్టీ కార్యకర్తలు జయ జయ ద్వానాలు పలుకుతుండగా హయిగా ఇంటికి వెళ్ళి  పొట్ట చక్కలయ్యేలా నవ్వుకుంటూ, పొలిస్ విచారణకు రావాలంటే నాలుగు రోజులాగాలి అని సమాచారం పంపించాడట. అదేంటి మొన్న లండన్ లో ఉన్నప్పుడు హైదరాబాద్ రాగానే వస్తామన్నారు కదా అని పొలిస్ వారు అమాయకంగా అడిగితే,  తాను నవ్వి,నవ్వీ కడుపునెప్పి వచ్చిందని, అది తగ్గాలంటే మరో నాలుగు రోజులు పట్టుదని, ఈ లోపు ఇంకొక సారి నవ్వు రాకుంటే అప్పుడు తప్పకుండా నాలుగు రోజుల్లో వస్తాను అని చెపితే పోలిస్ లు తెల్లబోయి చూసారట! అది చూసిన సదరు నాయకుడికి మరొక సారి పొట్ట చెక్కలయ్యేలా నవ్వు వచ్చిందట.

  ఈ విదంగా మన వెదవాయితనమే కాదు, మన పోలిస్ వారిని కూడ చూస్తుంటే ఆయనకు నవ్వు వస్తూనే వుంటుంది కాబట్టి ఇక ఆయన విచారణకు వెళ్లే అవసరం ఉండదనుకుంటా!    

Saturday, January 5, 2013

ఎలగెలగా! రాత్రుళ్లు కరెంటే ఇవ్వలేనోళ్లు, రక్షణ ఇస్తారా!


                                                                  నిన్న రాష్ట్ర రాజదాని నగరంలో మహిళలు "అర్థ రాత్రి మార్చ్" చేశారు. గాంది గారి " అర్థరాత్రి స్వాతంత్ర్యం" " స్పూర్తితో ఈ మిడ్ నైట్  మార్చ్ చేసినట్లుంది. ఇది నిర్బయ ఉదంతానికి నిరసనగా చేసినట్లు నిర్వాహకులు చెప్పినా, అందులో పాల్గొన్న స్త్రీలు చేసిన ముఖ్యమైన డిమాండ్, తమకు పగలే కాదు రాత్రుళ్లు  గౌరవం (రక్షణ) కావాలి అని. నాకొక అనుమానం ఏమిటంటే, ఏదో ఇది పగలు, రాత్రి అని ప్రాస కోసం చేసిన దే కాని ఇందులో వాస్తవం లేదనిపిస్తుంది. అసలు పగలు ఎక్కడ స్త్రికీ రక్షణ దొరుకుతుంది చెప్పండి? స్త్రీలు  అదికబాగం అవమానాలు పగలే పోందుతున్నారని నా అభిప్రాయం. దీని కోసం పగలు, రాత్రి లెక్కలు తీస్తే కాని విషయం బోదపడదు.

  ఇక పోతే మిడ్ నైట్ మార్చ్ కు స్త్రీలు అదిక సంఖ్యలో పాల్గొనడం ఆనందకరమైన విషయం. దీనికి చాలమంది స్త్రీలు తమ వెంట సహాయంగా మగాళ్లుని వెంట తెచ్చుకోవడం వారి వాస్తవ ద్రుష్టికి అద్దం పాడుతుంది. ఏదో పోలిస్లు ఉన్నారులే, తమకు రక్శణ ఇవ్వాల్సింది ప్రభుత్వమే కాబట్టి అంతా వారే చూసుకుంటారులే అని బ్లైండ్ బరోసాతో రాకుండా తమ రక్షణ దారులను తాము తోడు  తెచ్చుకున్నారు.ఇదే అసలు సిసలైనా స్త్రీ రక్షణా విదానం. ఇది కేవలం స్త్రీలకు తోడు ఉంటే సరి పోదు, తమ స్త్రీల మీద దాడి చేసిన వాడి అంతు చూసే దాక విశ్రమించని కుటుoబ సబ్యులు ఉన్న, కుటుoబానికి చెందిన స్త్రీల మీద చేయి వెయ్యడానికి ఎవరికయినా జంకే.

  అంతే కాని మీరు ఎన్ని గోలలు చేసినా, మన జాగర్తలో మనం లేకపోతె, జరిగే అనర్థానికి విచారణలు, శిక్షలే, తప్పా నివారణా మార్గాలు శూన్యం. అసలు ప్రజలకు రాత్రుళ్లు కరెంటే ఇవ్వలేని ప్రబుత్వాలు, రక్షణ ఇస్తాయా? మన పిచ్చి గాని! ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడ ఇవ్వరని మన్న డిల్లీ ఉదంతమె చెపుతుంది. దారుణానికి గురై, రోడు మీద  వివస్త్రగా పడి ఉన్న అమ్మాయికి ఒక గుడ్డముక్క కప్పడానికి గంటల సేపు, అటు పోలిస్ లుకు ఇటు ప్రజలకు చేతులు రాలేదంటే జనాలు ఎటువంటి అమానవీయంగా ఉన్నారో తెలుస్తుంది. ఎందుకు ప్రజల్లో ఇలాంటి నిర్లిప్తత చోటు చేసుకుందో చెప్పగలరా? ఆర్థరాత్రి బాయి ఫ్రెOడ్లతొ తిరిగే వారనా? లేకా గాలికి పోయేది మనకెందుకనా? ఏదైనా అమానుషమే. ముందు స్త్రీలు వాస్తవ ద్రుక్పదంతో వ్యవహరిస్తే, వారికి కుటు0భ రక్షణ, తద్వారా సమాజ రక్షణా లబిస్తుంది. ఏదైనా ఒకటి మాత్రం నిజం. డిల్లీలో జరిగిందే ఏ పల్లేటూళ్ళోనో జరిగితే,ఆ అమ్మాయి అంతసేపు నడిరోడ్డు మీద చలిలో వివస్త్రగా బాదపడేది కాదు అన్నది సత్యం. ఈదేశంలో నగరాలుళొ మాయమైనంతగా మానవత్వం పల్లేటూల్లో మాయం కాలేదు.ఎక్కడుందో లోపం అర్థం చేసు కోవటం     ఆదునిక సంస్క్రుతి గురించి తెగ మురిసిపోయే వారికి చేతనవుతుందో లేదో?           

కోటి సంతకాలు కో అంటె దొంగ దొర అవుతాడా?



 అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమనుకుంటున్నరు.? ప్రజలు ఒప్పుకుంటే దొంగ దొర అవుతాడా?అలా అయితే  ఎన్నికల్లో పోటి చేసిన నిందితులు కనుక ఎన్నికల్లో గెలిస్తే, వారికి ప్రజా మద్దతు ఉందని వారి నేరాలను క్షమించాల్సి ఉంటుంది. ఒక వేళా ఇదే పద్దతి అమల్లోకి వస్తే ఎదో ఒక రకంగా కోట్ల    రూపాయలు దోపిడి చేసి, అందులో కొంత సొమ్ము ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చి,గెలిచి, రాజ్యాంగాన్ని అవమానం చేయవచ్చు

  కాబట్టి ఇటువంటి తప్పుడు చెష్టలు మానుకోవడం మంచిది. ఒక వేళా ఎవరైనా దోపిడి దారులు తాము చేసిన దోపిడికి,ప్రజా సమ్మతి ఉందనుకుంటే, తాము దోపీడి చేసామని ఒప్పుకుంటూ,తాము చేసింది కరక్టే నని  రెఫ్రెండమ్ ద్వారా తేల్చుకో మనండి. ఒక వేళా మెజార్టీ ప్రజలు మీరు చెప్పేదే చట్ట మంటే, కోర్టులు గీర్టులు జాన్తా నై అంటే, మీదే      ఈ దోపిడి రాజ్యం. మేము మీ అడుగు జాడల్లోనే నడుస్తాం. దోచుకున్న వారికి దోచుకున్నంతా మహ దేవా!

 కాని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తే ఖచ్చితంగా మీరు నేరం చేసారు అని నిర్దారించుకోవలసి ఉంటుంది. (  ఇది కోటి సంతకాలతో కోర్టులు ని బ్లాక్ మెయిల్ చేద్దామనుకునే వారి నుద్దేసించి మాత్రమే)    

Thursday, January 3, 2013

"తిండి నీ కోసం తిను, బట్టలు మాత్రం ఎదుటివారి కోసం కట్టు"


                                    ఈమద్య జరిగిన డిల్లీ గాంగ్రేప్ ఉదంతం  తర్వాత "స్త్రీల రక్షణ" అనెది ఒక పెద్ద సమస్యగా అటు ప్రబుత్వం ఇటు ప్రజలు గుర్తీంచారు. స్త్రీల మీద లైంగిక దాడులు అపటానికి ఎవరికి తోచిన మార్గం వారు చెపుతున్నారు. దీనికి ఎవరూ ఎవర్ని తప్పు పట్టాల్సింది ఏమి ఉండక పొవచ్చు.

  స్త్రీల రక్షణకు పటిష్టమయిన చట్టాలు, దానిని  చిత్తశుద్దితో అమలు చేయగల యంత్రాంగమ్ ఏర్పాటు విషయం లో, ఏ వర్గానికి అబ్యంతరాలు లేవు. కాని స్త్రీల వస్త్రదారణ విషయం లో కొన్ని జాగ్రతాలు తీసుకోవాలి అని సూచించి నప్పుడు ఆదునిక యువత కు ఇది నచ్చడం లేదు. ఇటువంటి సూచనలను  స్త్రీ వాదులు సహితం ఖండిస్తున్నారు. డిల్లీ వీదుల్లో ఆడపిల్లలు " మా శరీరం, మా ఈష్టం" అని రాసిన ప్లకార్డులు పట్టుకుని "అమానత్" దురంతానికి నిరసన తెలిపే కార్య క్రమం లో పాల్గొన్నారు అంటే, దీనిని బట్టి తెలిసికోవచ్చు వారు ఎటువంటి స్వేచ్చ కోరుకుంటున్నారో.!

పోలిస్ అదికారులు కొంత మంది చెపుతున్న దాని బట్టి, అదునిక స్త్రీల వస్త్ర దారణ కూడ  వారి మీద అత్యాచారాలు జరగటానికి ఒక కారణం. దీని సాంప్రదాయ వాదులు ఎలాగు సమర్దిస్తారు కాబట్టి, స్త్రీ వాదులు దీనిని వ్యతిరేకిస్తారు.. చదువుకునె ఆడపిల్లల్లో కొంత మంది స్త్రీవాద తరహ(నా బాడి, నా ఇష్టం) స్వేచ్చ ని సమర్దిస్తూ,  వీదుల్లోకి వస్తుంటే ఇష్టం లేని వారు సహితం వారిని మౌనంగా అనుసరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్తితిలు అటు వంటివి.

  మన కొక సామెత ఉంది. "తిండి నీ కోసం తిను, బట్టలు ఎదుటివారి కోసం కట్టు" అని .ఇది నూటికి నూరు పాల్లు నిజం. మనం ఎంత కోటీశ్వరులమయినా "షుగర్ వ్యాది" ఉంటే పంచ బక్ష్య పరమాణ్ణం తినలేం కదా! ఎందుకంటే తింటే చస్తాం కాబట్టి. వస్త్ర దారణ అలాంటిదే. మనకు బట్టలు అవసరం లేదని అవి లేకుండా వీదుల్లోకి పోలేము కదా. ఎందుకని ?మనం బట్టలు వేసుకోకపోతే మనకు లేని నష్టం ఎదుటివాడికి ఏమిటీ? ఎందుకు న్యూసెన్స్ కేస్ పెడతారు? ఎందుకంటే మన పైత్యం ఎదుటివారిలో అనేక వికారాలు కలిగిస్తాయి కాబట్టి.అలా వికారం కలిగించని వస్త్ర దారణే మనం చెయ్యాలి. లేదా మనంఎలా ఉన్నా వికారం పొందని హై క్లాస్(వారి ద్రుశ్టిలో) వారు ఉన్న ప్రాంతాలకు వెళ్ళి పోవడం మంచిది.ఇటు వంటి హై క్లాస్ వారు తమ దనం తో  ప్రైవేట్ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుని ఆనందంగా ఎగరవచ్చు. అంతే కాని నూటికి తొంబైమంది సాంఫ్రాదయవాదులు ఉన్న దేశం లో వారు చెపుతున్న దానికి విలువనివ్వకుండా, కేవళం వ్యాపార సంస్క్రుతికి పనికి వచ్చే అదునికతను అనుసరించాలనడం నియంత్రుత్వమే అవుతుంది.సాంప్రదాయ వాదులది ఒకటే మాట" మాకు స్త్రీ రక్షణే ముఖ్యం. దానికోసం  అవసరమయిన అన్ని మార్గాలను అనుసరిస్తాం. అనుమానమున్న మార్గాలు మూసివేస్తాము".     


                                                                                                         

పత్రీజీ పిరమిడ్ లు వర్సెస్ శాస్త్రీయా వాదుల టి.వి. లు


http://kalkiavataar.blogspot.in/2013/01/blog-post_524.html
పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్కండి

ద్యానం అంటె తెలియని విజ్ణానులకు, పిరమిడ్ ద్యానంతో పని ఏమిటి?

http://kalkiavataar.blogspot.in/2013/01/blog-post_524.html

 పూర్తి టపా కోసం లింక్ మీద క్లిక్కండి

Wednesday, January 2, 2013

"పిరమిడ్ ద్యానం","శాఖాహారం", గురువు కోపాన్నే తగ్గించలేకపోయాయి!

                                              
                                                                     
                                                                              
  ఈ మద్య "కడ్తాల్" లో పిరమిడ్ ద్యానమ్ పేరుతో ఒక గురువు హల్ చల్ చేసాడు. జీవితం లొ సుఖశాంతులు లేని జనం బాగానే అయన చుట్టూ చేరినట్లు తెలుస్తుంది.బాగా ఇంఫ్ల్యూయన్స్ చేసాడు అనుకుంటా మంత్రులు, అదికార్లు దండిగానే విచ్చేశారు. నూట ముప్పై ఎకరాలలో ఒక భారీ "పిరమిడ్" సెట్టింగ్ తో అక్కడ ఒక యాక్షన్ టీమ్ తో కార్యక్రమాలు మొదలు పెత్టి పద్సకొండు రోజులు నిర్వ హించారు.అక్కడ రోజు డాన్స్ లు, గానా బాజానాలు లాంటివి జరిగాయని టి.వీ లు కోడై కూయడమే కాక క్లిప్పింగ్ లు చూపిస్తున్నాయి.

  సరే అసలు పిరమిడ్ ద్యానం అంటే ఏమిటో రెండు ముక్కల్లో  చెప్పుకుందాం. ఏమి లేద్సార్, సాదార్ణంగా ద్యానం అనేది మానసిక ప్రశాంతత కల్పిస్తుందని మనకు తెలుసు. కాని ద్యానం లో మనస్సు లగ్నమ్ చెయ్యాలంటే కొంత సమయం పడుతుంది. ఈ సమయాన్ని పిరమిడ్ ఆకారం ఉన్న ఏ వస్తువు క్రిమ్ద చెసినా సమయం తగ్గించడమే కాక ద్యాన పలితమ్ ఎక్కువగా ఉంటుందట. అంటే సాదార్ణ ద్యానం "టన్ను" ప్రశాంతత ఇస్తె ’పిరమిడ్ ద్యానం" "వంద టన్నులు"  ప్రశాంతత ఇస్తుందన్న మాట.(ప్రశాతత ని దేనితో కొలవాలో తెలియక టన్ను" ల్లో చెప్పదం జరిగిమ్ది).సరే పిరమిడ్ గురువు గారు చెప్పే దానిని లక్శలాది ప్రజలు నమ్మి,దానిని అచరించారట. ఆ ఆచరణా పలితాలు గురువు గారు చెప్పే దానిని రుజువు చెయ్యడం వల్ల విపరీతమ్ గా ప్రజలు ఈ విదానానికి ఆకర్షింపబడి గురువు గారు పాపులర్ అయ్యారు. ఎంతగా పాపులర్ అయ్యారు అంటే టి.వీ. నైన్ వాళ్ళు తగులుకునేంతగా!

  సరె ఈ విదంగా పాపులర్ అయితే వీరీ సహజ శత్రువులు అదేనండి "జన విజ్ణాన వేదిక" లాంటి శాస్త్రీయ వాదులు,  వారు ఊరుకుంటారా? ఊరుకోరు గాక ఊరుకోరు కాబట్టి, పిరమిడ్ లోని కత ఏందని గురువును అడిగారు. ముందు గురువు గారు ఒక ప్రశ్న వేసారు. మీకు ద్యానం అంటే తెలుసా? అని .దానికి శాస్త్రీయంగా తల అద్డంగా ఊపారట.దానితో చిర్రెత్తుకొచ్చిన గురువు గారు, ద్యానం అంటేనే తెలియని వారికి పిరమిడ్ ద్యానమ్ గురించి ఎంత చెపితె మాత్రమ్ ఏమి లాభం, కాబత్టి ముమ్దు ద్యానం గురిమ్చి తెలుసుకొంది అని అనె సరికి పాపం శాస్త్రీయ వాదులంతా ద్యానం గురించి తెలుసుకోవాలని  "రజనీకాంత్" గారి దగ్గరకు వెళ్లారట. ఎందుకంటరా? హిమాలయాలకు దారెటో కనుకుందామని. కాబట్టి వారు ద్యానమ్ గురించి తెలుసుకుని వచ్చి, గురువు గారి దగ్గర పిరమిడ్ ద్యానమ్ గురించి తెలిసికొని మనకు వివరిoచేదాక "పిరమిడ్ ద్యానమ్ "  లో ఉన్న కిటుకు మనకు తెలియదు. అమ్మయి/అబ్బాయి  ప్రేమలొ పడితె మత్తుగా ఉంటుమ్దని పడిన వాల్లకు తెలుస్తుంది కాని అ మత్తుకు  కారణమేమిటో వారెలా చెప్పగలరు? ఇది అంతె అనుకుంటా!

    కాబట్టి శాస్త్రియ కారాణాలు తెలిసికొలేము. ఇక పొతె,  సలు గురువు గారు చెపుతున్నట్లు పిరమిడ్ ద్యానమ్ మానసిక ప్రశాంతత ఇస్తుందా? ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఆ గురువు గారు ఒక పెద్ద మాట అన్నాడట! (బూతు కాదులెండి). ఈ దేశమ్ లో రిక్షా తొక్కే వాడి దగ్గరి నుంచి, మంత్రుల దాక అంతా మూర్కులె అని .ఇదెమిటి ఇలా అన్నాడని ఆరాతీస్తే ఆయన కోపానికి కారణమ్ తెలిసింది. వాల్లంతా మాంసాహారులంట, అందుకే  వారి బ్రెయిన్ డల్ అయిపోయి మూర్కులై పోతున్నారట. అబ్బా ఎంత సత్యమ్ కనిపెట్తాడండి, ఈ గురువు గారు. ఈయన పత్రి అని పేరు పెట్టుకున్నాడు కాబట్తి అందర్ని పత్రాలు(ఆకులు) తినమని సలహా ఇస్తున్నట్లుంది.పిరమిద్ ద్యానమ్ వల్ల మనిషి ప్రశాంత చిత్తుడయి కోపాన్ని జయించడం నిజమే అయితే, మరి దశాబ్దాలుగా ఆ పిరమిద్ ద్యానమ్ చేస్తున్న గురువు గారిలో ఇంకా కోపం తగ్గలెదే?.గురువు కోపాన్నే తగ్గిమ్చలేని పిరమిద్ లు ప్రజల కోపాన్ని తగ్గిస్తాయా?అయ్యో రామా!

  అయినా మన కిప్పుడు కోపం చాలా అవసరం. అసలే ఒకపక్క అవినీతి పరులు, ఇంకొక పక్క రేపిస్ట్ లు ఈ దేశాన్ని నాశనమ్ చెస్తుంటే వారి మీద కోపం రాకుంటే దర్ణాలు ఎలా చేస్తాం?ఆందోళనలు ఎలా కొన సాగిస్తాము?. అమ్మో,కశ్టం. అమ్దుకే గురువు గారిని టి.వీ.నైన్ వాళ్లకి అప్ప చెప్పి మనం ఎంచక్కా మటన్,చికెన్ దండిగా లాగిద్దాం. అప్పుడే మనం ఉద్యమాలు చెయ్యడానికి శక్తి, మన బాదలకు విముక్తి.        

మ్రుగాడ్ని ఉరితీసే బదులు వాడి "అహంకారాన్ని"(?) తొలగిస్తే?

http://kalkiavataar.blogspot.in/2013/01/blog-post_2.html
 పూర్తి టపా కోసం లింక్ మీదక్లిక్కండి

"రేప్" నేరానికి "ఉరి శిక్ష" వలన లాభం కంటే నష్టం ఎక్కువ!

                    
                                                                          

  మొన్న డిల్లీలో గాంగ్ రేప్ తర్వాత అందరం ఆవేశ పడి పోయి, రేపిస్టులకు మరణ శిక్షే సరి అయినదని డిమాండ్ చెస్తున్నాం. నేను కూడ అదే అవేశం లో అదే కరెక్ట్ అనుకున్నాను. కాని నెమ్మదిగా, కూల్ మైంద్ తో అలోచిస్తే, ఈ డిమాండ్ తప్పని, ఒక వేళా అలాంటి శిక్షలే చట్టం లో పొందుపరుస్తే, దాని వలన ఆడపిల్లలు కు  మేలు కంటే కీడే అదికమని అనిపిస్తుంది.

  ఎలాగంటారా, ఇప్పట్టి వరకు రేప్ కీ గరిష్టంగా  శిక్ష  పది యేండ్లు మాత్రమె. కాబట్టి రేపిస్టుకు తాను చట్ట పరంగా శిక్షించబడినా ప్రాణం తీయరనె బరోసా ఉంటుంది కాబట్టి బాదితురాలికి ప్రాణ హాని తలపెట్టడు. అదే ఉరి శిక్ష అయితే ఎలాగు తాను చావడం ఖాయం కాబట్టి, కేసులో కీలక సాక్షి బాదితురాలే కాబట్టి, అమెను చంపితే కేసులో సాక్ష్యం లేకుండా చెయొచ్చు అనే బావనకు రావచ్చు. ఆమె బ్రతికున్నా, చచ్చినా ఒకటే శిక్ష కాబట్టి, ఆమెను చంపితేనే కొంతవరకు కేసు నుండి లేక ఉరి శిక్ష నుండి తప్పించుకోవచ్చు అని బావించే ప్రమాద ముంది. దీని వలన ప్రతి రేప్ బాదితురాలి ప్రాణానికి  రిస్క్ ఏర్పడుతుంది. కాబట్టి మనమ్ అవేశం తో కాక విజ్ణతతో, వాస్తవిక ద్రుష్టితో అలోచించాలి.
        మొన్నటి వరకు మన దేశమ్ లొ ఉరిశిక్ష  ని రద్దు చెయ్యాలని పరి వర్తన వాదులు వాదించారు. కాని డిల్లీ ఘటన చూశాక  మానవ మ్రుగాలకు ఉరిశిక్షే కరెక్ట్ అంటున్న జాతి యావత్తు ను చూసి ఏమనలెక పోతున్నారు. ఒక పక్క ఆడపిల్లలు గలమెత్తి అందోళన చెస్తుంటే, ప్రబుత్వానికి గుండే జారి పొతుంది,ఇదెక్కడ మహా ఉద్యమంగా  మారి తమ అదికారానికే ఎసరు వస్తుందో అని. కాని మ్రుగాల్లకు మాత్రం ఏ మాత్రం జంకు గొంకు లేదు అనిపిస్తుంది. అసలు డీల్లీ ఘటన తర్వాత, అత్యచారాలు ఎక్కువ పెరిగాయో, లేక పత్రికల వాళ్ళు శ్రద్దగా ప్రతి అత్యాచారాన్ని ప్రచురిస్తున్నారో తెలియదు కాని అవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వార్తలు చూస్తుంటే సామాన్య ఆడపిల్లలకు  వారి తల్లి తండ్రులకు భయం వేస్తుంది. నేను మొన్న ఒక చోట కొంత మంది పెద్దల మాటలు అలకించాను. ఆడపిల్లల్ని  పెద్ద చదువులు చదివించే బదులు తొందరగా  పెళ్ళి చేసి, తమ బాద్యతలు తీర్చుకుంటే మేలు అని.

  పై మాటలు విన్న నాకు  ఒక్క సారిగా చరిత్ర గుర్తుకు వచ్చింది.వెనుకటి రోజుల్లో  మన వాళ్ళు ముస్లింల దండయాత్రలు సందర్బంగా పెళ్లికాని ఆడపిల్లల్ను చెరపట్టే వారని వారిని కాపాడుకోవడం కోసం వారికి బాల్య వివాహలు చెసే వారని చదువుకున్నాం.తిరిగి ఆడపిల్లల మీద అత్యాచారాలు నిరోదించలేక పోతె, తల్లి తండ్రులు ఆడపిల్లల్ని కాలేజిలకు పంపే బదులు పెళ్ళి చెయ్యడానికే మొగ్గు చూపొచ్చు. ఇది చూడటానికి కొంత విచిత్రంగా అనిపించినా ఆదునిక వస్త్రదారనే అత్యాచారాలకు ప్రదాన కారణమని పెద్దలు బావిస్తే జరుగబోయే పరిణామం ఇదే. పరువుగల తల్లి తండ్రులు పరువుగా తమ పిల్లల్ని ఒక పరువుగలవాడి చేతిలో పెట్టి తమ దర్మాన్ని నెర వేర్చాలనుకుంటారు. పరువు అనేది ట్రాష్ అనే గొప్ప సంస్కారం(?) నూటికి తొంబయిమందికి ఉండక పోవచ్చు. అటువంటి వారు దేన్నైన ఈజీగా తీసుకోవచ్చు. కాని బలయ్యెది సామాన్య, సాంప్రదాయ వాదులైన తల్లి తండ్రులున్న ఆడపిల్లలే. కాబట్టి తక్షణం ఈ సమస్యను సీరియస్ తీసుకోకపోతే ఇదొక సామాజిక రుగ్మత గా మారె ప్రమాదముంది.   

  ఉరి శిక్షకు బదులు, కొంతమంది సూచిస్తున్నట్లు, రసాయానాలతో, రేపిస్ట్" మగ అహంకారాన్ని" తొలగిస్తె మంచిదనుకుంటా! ఈ దిశగా  సామాజిక వాదులు ఆలోచన చెయ్యాలని కోరుతున్నాను.నేను ఇదివరకటి టపాలో చెప్పినట్ట్లు, దీని మీద ఒక సమగ్ర అద్యయనం చేసేటందుకు నిర్థిష్ట కాల పరిమితితో కూడిన ఒక కమిటీ ని వేస్తె మంచిది. జుడిషియల్ కమిషన్ వలన లాభమ్ లేదు. సామాజిక వాదులు, స్త్రీ వాదులు, న్యాయ నిపుణులు, పోలిస్ అధికారులతో కూడిన ఒక విస్త్రుత కమిటీ నీ వేయాలి. అప్పుడే ఏమన్నా పలితం ఉండవచ్చు.  

Tuesday, January 1, 2013

సాంప్రదాయ దుస్తులు దరించిన వారు "రేప్" లకు గురికావటం లేదా?



  నిర్బయ ఉదంతం తర్వాత  స్త్రిల మీద అత్యాచారాలు గురించి విబిన్న వాదాలు నడుస్తున్నాయి దేశం లో. సాంప్రదయ వాదులు, పొలీసులు, రాజకియ నాయకు అత్యదికులు స్తిల  ఆదునిక వస్త్రదారణ  వారి మీద అత్యాచారాలు జరిగేలా పురిగొల్పుతుంది అని వాదిస్తుంటే, అదునిక మహిళలు, విద్యార్దినులు మండి పడుతున్నారు. ఇదంతా పొలిసుల, నాయకుల చేతకాని తన్నాన్ని కప్పి పెట్టుకోవాడానికి చెప్పే మాటలు అని వాదిస్తున్నారు.

 ఇక్కడ గమనించ దగిన విషయం ఏమిటంటే, స్త్రీల  ఆదునిక వస్త్ర దారణే రేప్ లు జరగటానికి కారణమయితే, సాంప్రదాయ వస్త్రదారణ చేసే స్త్రీల మీద అత్యాచారాలు జరుగ కూడదు. లేదా అత్యదిక అత్యాచారాలు అదునిక వస్త్రదారుణిల పైనే జరగాలి! అలా జరుగుతున్నాయా? ఒక వేళా అసలు బట్టలు కట్టుకోకుండా వీదుల్లో తిరిగినా ఆ వంక తో రేప్ లు చేసే హక్కు మగవాళ్ళకు ఉంటుందా?వారి మీద న్యూసెన్స్ కెసులు పెట్టాలే కాని లైంగిక దాడులు చెస్తె అది ఖచ్చితంగా నేరం అవుతుంది.

 కాని ఇదే సందర్బంలో ఒక విషయమ్ గుర్తుంచుకోవాలి. అసలు స్త్రీల పట్ల రేప్ లు అదికంగా జరగడానికి ఏ కారాణాలు దోహద పడుతున్నాయి అనే దాని మీద సమగ్ర అద్యయనం జరగాలి. దాని ద్వార కారణాలు కనుగొనడమె కాక అత్యాచారాల నివారణకు తగిన విదానాలు రూపొందించుటకు అవకాశం ఉంటుంది. ఈ అద్యయన కమిటీల్లో, ఈ విభిన్న వాదలు చెసే వారికి ప్రాతినిద్యం కల్పిస్తె మంచిది. కేవలం న్యాయ కమీషన్లు కాకుండా సామాజిక,సాంస్క్రుతిక రంగాల్లో సేవ చెస్తున్న వారిని, మంచి పరిజ్ణానం కలిగిన వారిని ఈ కమిటీల్లో సబ్యులుగా వేస్తే మంచి పలితముంటుంది. కేంద్ర ప్రభుత్వం ఈదిశగా ఆలోచించాలి.