Saturday, January 5, 2013

ఎలగెలగా! రాత్రుళ్లు కరెంటే ఇవ్వలేనోళ్లు, రక్షణ ఇస్తారా!


                                                                  నిన్న రాష్ట్ర రాజదాని నగరంలో మహిళలు "అర్థ రాత్రి మార్చ్" చేశారు. గాంది గారి " అర్థరాత్రి స్వాతంత్ర్యం" " స్పూర్తితో ఈ మిడ్ నైట్  మార్చ్ చేసినట్లుంది. ఇది నిర్బయ ఉదంతానికి నిరసనగా చేసినట్లు నిర్వాహకులు చెప్పినా, అందులో పాల్గొన్న స్త్రీలు చేసిన ముఖ్యమైన డిమాండ్, తమకు పగలే కాదు రాత్రుళ్లు  గౌరవం (రక్షణ) కావాలి అని. నాకొక అనుమానం ఏమిటంటే, ఏదో ఇది పగలు, రాత్రి అని ప్రాస కోసం చేసిన దే కాని ఇందులో వాస్తవం లేదనిపిస్తుంది. అసలు పగలు ఎక్కడ స్త్రికీ రక్షణ దొరుకుతుంది చెప్పండి? స్త్రీలు  అదికబాగం అవమానాలు పగలే పోందుతున్నారని నా అభిప్రాయం. దీని కోసం పగలు, రాత్రి లెక్కలు తీస్తే కాని విషయం బోదపడదు.

  ఇక పోతే మిడ్ నైట్ మార్చ్ కు స్త్రీలు అదిక సంఖ్యలో పాల్గొనడం ఆనందకరమైన విషయం. దీనికి చాలమంది స్త్రీలు తమ వెంట సహాయంగా మగాళ్లుని వెంట తెచ్చుకోవడం వారి వాస్తవ ద్రుష్టికి అద్దం పాడుతుంది. ఏదో పోలిస్లు ఉన్నారులే, తమకు రక్శణ ఇవ్వాల్సింది ప్రభుత్వమే కాబట్టి అంతా వారే చూసుకుంటారులే అని బ్లైండ్ బరోసాతో రాకుండా తమ రక్షణ దారులను తాము తోడు  తెచ్చుకున్నారు.ఇదే అసలు సిసలైనా స్త్రీ రక్షణా విదానం. ఇది కేవలం స్త్రీలకు తోడు ఉంటే సరి పోదు, తమ స్త్రీల మీద దాడి చేసిన వాడి అంతు చూసే దాక విశ్రమించని కుటుoబ సబ్యులు ఉన్న, కుటుoబానికి చెందిన స్త్రీల మీద చేయి వెయ్యడానికి ఎవరికయినా జంకే.

  అంతే కాని మీరు ఎన్ని గోలలు చేసినా, మన జాగర్తలో మనం లేకపోతె, జరిగే అనర్థానికి విచారణలు, శిక్షలే, తప్పా నివారణా మార్గాలు శూన్యం. అసలు ప్రజలకు రాత్రుళ్లు కరెంటే ఇవ్వలేని ప్రబుత్వాలు, రక్షణ ఇస్తాయా? మన పిచ్చి గాని! ప్రభుత్వాలే కాదు ప్రజలు కూడ ఇవ్వరని మన్న డిల్లీ ఉదంతమె చెపుతుంది. దారుణానికి గురై, రోడు మీద  వివస్త్రగా పడి ఉన్న అమ్మాయికి ఒక గుడ్డముక్క కప్పడానికి గంటల సేపు, అటు పోలిస్ లుకు ఇటు ప్రజలకు చేతులు రాలేదంటే జనాలు ఎటువంటి అమానవీయంగా ఉన్నారో తెలుస్తుంది. ఎందుకు ప్రజల్లో ఇలాంటి నిర్లిప్తత చోటు చేసుకుందో చెప్పగలరా? ఆర్థరాత్రి బాయి ఫ్రెOడ్లతొ తిరిగే వారనా? లేకా గాలికి పోయేది మనకెందుకనా? ఏదైనా అమానుషమే. ముందు స్త్రీలు వాస్తవ ద్రుక్పదంతో వ్యవహరిస్తే, వారికి కుటు0భ రక్షణ, తద్వారా సమాజ రక్షణా లబిస్తుంది. ఏదైనా ఒకటి మాత్రం నిజం. డిల్లీలో జరిగిందే ఏ పల్లేటూళ్ళోనో జరిగితే,ఆ అమ్మాయి అంతసేపు నడిరోడ్డు మీద చలిలో వివస్త్రగా బాదపడేది కాదు అన్నది సత్యం. ఈదేశంలో నగరాలుళొ మాయమైనంతగా మానవత్వం పల్లేటూల్లో మాయం కాలేదు.ఎక్కడుందో లోపం అర్థం చేసు కోవటం     ఆదునిక సంస్క్రుతి గురించి తెగ మురిసిపోయే వారికి చేతనవుతుందో లేదో?           

No comments:

Post a Comment