Thursday, December 6, 2012

వీరభోగ వసంతరాయలు రావాల్సిన ఆ "ప్రహ్లాదమయిన పని" ఏమిటి?

                                                                    

మీకు తెలుసా? బ్రహ్మం గారి కాలజ్ణానంలో రాబొయే అవతారపురుషుడు"వీరభొగ వసంతరాయలు"(ఇయనే కల్కి అని చాల మంది నమ్మకం), ఎప్పుడు బయట ప్రపంచానికి కనపడతాడు అనేది స్పష్టంగా ఉంది. నేను "కల్కి" వివరాలు గురించి ముందు చెప్పి, ఆ తర్వాత వీరభోగుని గూర్చి చెపుదాము అనుకున్నాను. కాని ఎందుకో మన రాష్ట్రంలో మరియు ఇతర దేశంలో ఈ మద్య జరిగే కొన్ని సంఘటనలు గమనించాక "వసంతరాయలు" గురించి అర్జంట్ గా  ఒక ముక్క మీ చెవిన వేద్దామనే  తహ, తహ తో ఈ టపా మీ ముందుంచడమయినది.

 "కాలజ్ణనం"లో ఒక చోట "వీరభోగ వసంతరాయలు" ప్రజలకు ఎప్పుడు దర్శనమిస్తాడు అనేది వివరిస్తూ,"ప్రహ్లాదమయిన పని కాగలదు, వారి కొరకు రావాల్సి ఉండును" అని ఉంది. ’ఈ ప్రహ్లాదమయిన పని ఏమిటా అని నేను చాలా సార్లు ఆలోచించాను. కాని నా బుర్రకేమి తోచలేదు. గత నాలుగు రోజులుగా అటు టి.విల్లోను,ఇటు మన బ్లాగుల్లోను ఒకటే ఊదరగొడుతున్న,"నార్వే వారి దెబ్బ, అంద్ర దంపతులు అబ్బా" అనే సీరియల్ "టపాఓపాఖ్యానం" చూసాక సడెన్ గా ఒక అయిడియా "ఫ్లాష్" అయింది.

  "నార్వే" వారు ఆంద్రా దంపతులను జైల్లో వేయడానికి కారణం ఏమిటి? వారి పిల్లలే కదా! పిల్లల్ణి హింసిసించారన్న కారణంగానే తల్లి తంద్రులకు సిక్ష పడింది కాబట్టి,ఇదే "ప్రహ్లాద కారణం".ఎందుకంటే బాగవతంలో "ప్రహ్లాదుడు"తండ్రి చేత హింసించబడితే "నరసీంహుడు’ ఉద్బవించి, అతని తండ్రి హిరణ్యకశిపుని వదిస్తాడు. కాబట్టి బాల హింసే "ప్రహ్లాద కారణం".అయితే డిని కోసం "వీరభోగ వసంతరాయలు" రావడమేమిటి అన్నది కోటి డాలర్ల ప్రశ్న?

 నేను ఒకచోట చదివాను. ’కదిరి" లో ఉన్న "నరసింహ స్వామి"నే  "వీరభోగ వసంతరాయలు" అంటారట. మరి అయితే ఆ స్వామి వస్తాడా ఇప్పుడు, లేక అయన పేరు గలవారు వస్తారా? లేక "కదిరి" నుంచి వస్తారా? అసలు "వీరబోగ వసంతరాయలు" అనే పేరును బ్రహ్మం గారు ఎందుకు చెప్పారు? ఈయనకు "కల్కి"కి ఏమయినా సంబందం ఉందా? ఉంటే అది ఎలాంటిది? వీటన్నిటికి సమాదానం త్వరలో రాబొయే టపాలలో.

5 comments:

  1. nuvvu nee raatalu ... mokaaliki bodi gundu ki sambadham enti ?? nee talakaaya la undi .. kaasepu Jagan kalki antaav .. kaasepu valla chelli antav ... repu nuvve kalki anna antaav ...

    ReplyDelete
    Replies
    1. నా తలకాయ ఎప్పుడు చూసావు నువ్వు? పిచ్చి, పిచ్చి కామెంట్లు మాని, నీకు ఏమయినా సబ్జెక్ట్ మీద తచ్ ఉంటే చెప్పు,లేకుంటే మానెయ్యి.నేను పలానా వాళ్ళు కల్కి అని ఎక్కడా చెప్ప లేదు.ప్రతిదానికి ? ?? ప్రశ్న గుర్తు చివరలో పెట్టాను. దాని అర్థమేమిటో ఒకటవ తరగతి చదివే పిల్లల్ని అడిగి తెలుసుకో. నీకు అభిమానమున్న వారిని కల్కి అంటే "సంబరపడతావు" లేకుంటే"బోడిగుండు, బట్టతల అంటావా!.

      Delete
    2. naaku abhimanam unna vallu kaadu baabu .. Jagan kalki ante nenu oppukonu kaaka oppukonu. mana devullaki jagan enti polika .. ???

      Delete
  2. హ హ హహ....... పాపం ఇన్నాళ్లు "జగనే" కల్కి అని రాస్తారేమోనని ఆశగా ఎదురు చూస్తున్న "తిక్క శంకరయ్యల"కు సడెన్ గా రూటు మార్చి, ’బ్రహ్మం ’ గారు వీరబోగ వసంత రాయలు అంటే ఎలా సార్వబౌమ గారు. ’భి.సి. లు ఎక్కడ రాజ్యాదికారం చెస్తారో అని బయపడి చస్తున్న ఇతరర మత "దొరలకు" హిందువుల కల్కి గురించి చెప్పి ఎందుకు బెంబేలెత్తిస్తారు. ఆంతా "జగన్నాటకమే" అయినప్పుడు,"కల్కి"అయినా అయనే,వసన్తరాయలు అయినా ఆయనే కావాలి. లెకుంటే ’అలవాలమే" అల్లకల్లోలమే.

    ReplyDelete
    Replies
    1. Baabu Raaju .. nenu appati nunde cheptaam anukoni .. eeroju comment chesaanu ante ... nenu cheppedi ade .. oka roju ayana antaadu .. inko roju vere vallu antaadu .. enduku ani ??? eeyana anagaane ayana ayipodu ..

      aina Jagan ki mana devudiki realtion enti ?? nenu abhimaanine kaani .. ayanni devudu ani nenu anukonu ... oka manishi ante

      Delete