Tuesday, December 4, 2012

రాబోయే అవతార పురుషుడి తండ్రి పేరు "దేవగుహ్యుడు"! అంటె అర్థమేమిటి?

నేను ఇంతకు ముందు టపాలో (లింక్ ని క్లిక్ చెయ్యండి} చెప్పినట్లుగా "కల్కి" జన్మ విశేషాలకు, ఇతర వివరాలకు "కల్కి పురాణం" విష్ణు పురాణం" ఆదారాలుగా తీసుకోవటం జరిగింది. మరింత వివరణ కావాల్శినప్పూడు, "బ్రహ్మం గారు" మరియు నోస్ట్రాడామస్ "భవిష్య వాణిని" కూడ పరిశీలించడం జరిగింది.

 అదే విదంగా "కల్కి" తల్లి పేరును తెలియ పరచాను. ఇప్పుడు ఆయన తండ్రి పేరును విశ్లేషించి చెప్పడం జరుగుతుంది.

కల్కి పురాణం లో అయన తండ్రి పేరు "విష్ణు యశుడు" అని చెప్పగా, విష్ణు పురాణం లో "పరమాత్మ" తండ్రి పేరు "దేవ గుహ్యుడు" అని చెప్ప బడింది. మరి ఈ రెండూ ఒకటేనా? వేర్వేరు అయితే ఏది ప్రామాణికమో చూదాం.
"విష్ణు యశుడు" లేక "విష్ణు యశశుడు" అనగా ప్రఖ్యాతమయిన, "విష్ణువు" కు సంబందించిన పేరుగలవాడు అయి ఉండాలి. ఈ విదంగా చాలా నామాలు ఉన్నాయి.అదీ గాక ఆయన ఉండే గ్రామంలో "ప్రదానుడు" అంటే, ముఖ్యుడయి ఉండాలి.  బ్రహ్మ జ్ణాని అయి ఉండాలి.

 ఇక పోతే "దేవగుహ్యుడు" అంటే. తెలుగులో "దేవుని గుంట" అనే సామాన్య అర్థం ఉంది.అలాగే "దేవుని" అంటే పవిత్రమయిన అనే అర్థం కూడ ఉంది. ఈ విదంగా చూస్తే "పవిత్రమయిన మార్మిక స్తానం" అనే అర్థం కూడ వస్తుంది.
  పవిత్రమయిన అనే పదానికి "తిరు" అనే తమిళ పదం కూడా వర్తిస్తుంది. అలాగే నెల్లూరు జిల్లా వాళ్ళు, "గుంటలు’ ని "పతులు" అని కూడా అంటారు . ఈ విదంగా చూస్తే, "దేవుని గుంట" అంటే "పవిత్ర పతి" అనొచ్చు లేక పోతే "తిరుపతి" అని కూడ అనొచ్చు.
 కాబట్టి ఈ క్రింది పేర్లకు సంబందించిన ఏదో ఒక పేరు "కల్కి" తండ్రి పేరు అయి ఉండాలి అనుకుంటున్నాను.

(1), విష్ణు యశ్ (2) దేవపతి,(3)పవిత్ర పతి (4) విష్ణు కీర్తి (5) తిరుపతి. ఈ విదంగా ఈనామములకు సమానార్థ కాలలో ఏదో ఒక పేరు "కల్కి" అవతార పురుషుడి తండ్రి  పేరు అయి ఉండాలి.

  ఇతర వివరాలను తర్వాతి టపాలలో తెలుసుకుందాం . కల్కి తల్లి పేరును తెలుసుకుంటానికి "ఈ క్రింది లంకె ను క్లిక్ చెయ్యగలరు (http://kalkiavataar.blogspot.in/2012/12/blog-post_2.html)

No comments:

Post a Comment