Tuesday, December 11, 2012

26-12-2012 న 'నంద్యాల' దగ్గర్లోకి "వీరభొగ వసంతరాయులు" రాబోతున్నాడా!?


 నేను నిన్న"

"కదిరి" నరసింహుడే "వీరబోగ వసంత రాయలా"?

అనే టపా పెట్టడం జరిగింది. ఆ టపాలోని "సండ్ర చెట్టుకు" వీరబోగ వసంత రాయులు గల సంబందాన్ని, పరిశోదించాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగినది. దానికి స్పందించిన వీక్షక మిత్రులు దీనికి సంబందించి కొంత సమాచారాన్ని,నా ఈ మెయిల్ అడ్డ్రెస్ కు పంపించడం జరిగింది. దానిని యదాతదంగా ఈ క్రింద ప్రచురిస్తున్నాను:-

"సార్వభౌమ గారు,
యుగాంతం కు కార్యరంగం నల్లమల అడవుల్లొని ఓంకార క్షేత్రం లో సిద్దమవుతూంది.అక్కడ అవధూత కాశి నాయన భక్తుల చే వీరబోగ వసంత రాయల విగ్రహ ప్రతిష్ట జరిగింది.అక్కడి సాంద్ర చెట్టు కింద ఒక శనీశ్వర విగ్రహాన్ని ప్రతిష్టా చేసారు.సిద్దయ్య గ్రామమైన కలుగొత్ళ లో కూడా కల్కి విగ్రహం పెట్టి నిత్య అన్నదానం చేస్తున్నారు.ఓంకారం లో కొంద మీద అనెక దేవతా మూర్థులు పెట్టారు.దానికి ముందు అక్కడ అనెక పుట్ట లను  వెలికి తీసారు.ఇప్పుదు అందులోని ఋషులందరు కొంద మీదకు వెళ్ళారని అంటున్నారు.ఇదంతా నంద్యాల  సమీపం లొ జరుగుతున్నది."

  పయిన మిత్రుడు చెప్పిన దానిలో, కాశి నాయానా అవదూత గారు ప్రక్యాత యోగివర్యులు. వారికి అషేష సంఖ్యలో బక్తులు ఉండటం సహజం. బ్రహ్మం గారి కాలజ్ణానం ళో వీరి గురించిచెప్ప బడింది.వీరి బక్తులు అటవీ ప్రాంతమయిన "నల్లమల"లో శనీశ్వరున్ని ప్రతిష్టించి పూజలు జరుపటం ముదావహం. అందయిన, ఆహ్లాదకరమయిన ’నల్లమల" లోని ఈ ఓంకార క్షేత్రం బక్తులను విశేషంగా ఆకర్షించవచ్చు.సమాచారమిచ్చిన మిత్రులుకు దన్య వాదాలు తెలుపుతున్నాను.దీని గురించి ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉన్నందున, "ఒంకార క్షేత్ర" మహత్యం గూర్చి తర్వాతి టపాలో తెలియ చెయ్యడం జరుగుతుంది 


 

2 comments:

  1. poorthi gaa vinakundaa tapaa pettesthe yelaa?

    ReplyDelete
    Replies
    1. పూర్తి సమాచారంతో మీరే కామేంట్ పెట్టి షేర్ చేసుకోవచ్చు. మీరు అసంపూర్తి సమాచార మిచ్చారనుకోలేదు. అందుకే టపా పెట్టాను. పూర్తి సమాచారం తర్వాతనే ఎనలైజ్ చెద్దాం ఒ.కె.ఆ పార్ట్ ని తొలిగిస్తాను.

      Delete