Wednesday, November 28, 2012

"’ " బుద్ది భూములు" ఏలుదాం అంటే,రాత "గాడిదలు" కాద్దాం అందట!"!

                                                                                                                                                                                                                      
నేను "ఈ రాష్ట్రంలో ఎవరు సు పరిపాలన" ఇవ్వ గల నాయకుడు అని "సర్వె పోల్" పెడితే ’జయ  ఫ్రకాష్ నారాయణ్’,"చంద్ర బాబు నాయిడు"  వైపు ప్రజలు మొగ్గు చూపారు కాని, ఎవరూ కిరణ్ కుమార్ వైపు తల తిప్పి చూడలేదు.విచిత్రమైన అంశం ఏమిటంటే ,ఆయన మన సి.ఎమ్.అయినా ఒక్కడు కూడా ఆయనికి వోట్ వెయ్యలేదు.

.దీనివల్ల మనమొక విషయం అర్థం చేసుకోవాలి,"కిరణ్ కుమార్ రెడ్డి "గారికి ప్రజలలో "చరిష్మా" లేదు. అయన ముఖ్యమంత్రి అవుతారని ఎవరూ ఊహించని విషయం.అయినా ఆయన సి.యం అయ్యారు అంటే ఏమిటి కారణం. పైనున్న"అదిష్టాన దేవత" అని దేవున్ని నమ్మన్ని వారు సింపుల్  గా తీసి పారెయ్యొచ్చు. కాని" ప్రజా చరిష్మా" గలిగిన నాయకుల్ని కాదని కిరణ్ గారినే ఆమే ఎందుకు నియమించింది? ఏ సమాదానం చెప్పిన సంత్రుప్తికరంగా ఉండకపోవచ్చు.

 కాని "కిరణ్ కుమార్" గారి జాతక చక్ర ఫలం వల్ల అయన మీద దైవానుగ్ర్హం ఉండటం వలనే ఆయన ఇంత వొడిదుడుకుల్లో కూడ విజయవంతమైన పాలన చేస్తున్నాడు, అని మా బోటి ఆస్తికులు చెప్పేది మాత్రం చాలా మందిని సాటిస్పై చేసే  జవాబు కావచ్చనుకుంతా!

 అందుకే మేమనేది ,ప్రజా సమ్మత్తి ఉండని ఉండకపోని, ప్రజలంతా "సైతాన్" ల మాయలకు బ్రమసి,వెర్రివారై వారి చుట్టే తిరుగుతూ వారే తమ కాబోయే నాయకుడు అనుకోని గాక ఇవ్వన్నీ దేవుడి ముందు ఎందుకు కొరగావు.’బుద్ది బూములేలాదామంటే, రాత గాడుదులు కాద్దామందట! అనే సామెత ఊరికే రాలేదు నాయనలారా! తప్పకుండ మనకు మంచి రోజులు రాబోతున్నాయి! "కల్కి అవతారుడు" వస్తాడు, ఈ "కల్ నాయక్" లందరిని చెండాడుతాడు. ఇది ఆ బగవత్ నిర్ణయం .దీనిని ఎవరూ తప్పించలేరు.

 రోజు రోజుకు మారుతున్న పరిణామాలు చూసి అయినా ఇంకా ప్రజల ఆలోచనలో మార్పు రాక పోతే ఎలా? కోట్లు కుమ్మరించే దమ్మున్న వారిని సైతం "కటకటాల" వెనక్కి పంపించింది ప్రజా చైతన్యమా? వారిని అరెస్ట్ చెయ్యాలని ఎవరైనా ఉద్యమాలు చేసారా? లేదే! కేవలం రాతండి, రాత! అదే వారిని జైలుపాలు చేసింది! పొద్దున్న ఆరు గంటలకు ఇంట్లో ’కోట్లు" విలువ చేసే కుర్చీ లో కూర్చుని రాజసం వెలగబెట్టే వారిని సాయంత్రం ఆరు గంటలకు చిప్పకూడు తినే చెర సాలలో ఉంచింది ఏది> రాత బాబూ రాత!

  ప్రజలు, చైతన్యం, కోర్ట్లు, కేసులు ఇవన్న పైకి కనపడే కారణాలు కావచ్చు, కాని వాటిని నిర్ణయించిన ఆ దేవుడ్ని,లేక ఆ మహా శక్తిని మరిస్తే ఎలా?   ఆ బగవంతుడిని రమ్మని అందరూ ఆహ్వానిదాం  జై కల్కి! జై జై కల్కి.   

No comments:

Post a Comment