Sunday, November 18, 2012

బుద్దికి భూములేలాలని ఉన్నా, రాత "పావురాల గుట్టను" అడ్డం పెడుతుంది!


                                                                          

ఏమిటి సామెతను మార్చేసాను అనుకుంటున్నారా!.అవును అనుబవం లో నుంచి పుట్టేవే సామెతలు. మనం అనుకున్నది అనుకున్నట్టు జరగదు. జరిగితే ఆ దేవుడిని(దేవతని) మనం మర్చి పోతామని ఆయన భయం కాబోలు.

  నేను చెప్పే ఈ సామెత మన ప్రియతమ దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజ శేఖర్ రెడ్డి గారి గురించే.నిజంగా ఆయన ఒకగొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పవచ్చు. ఆయన ఊహించిన విదంగా ఆయన అనుకున్న"అపరేషన్ ఆకర్ష్" కనుక విజయవంతమైతే,ఈ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు పరేషానే. 2014 కల్లా వందమంది కార్యకర్తల బలమున్న అన్ని పార్టీలలోని  చోటా,మోటా నాయకులంతా "వై.యస్.ఆర్,జిందాబాద్" అనే వాళ్లు.రాహుల్ గాందికి మద్దతిచ్చే అంశంతో ఇక్కడ ఎదురులేని రారాజుగా మన రెడ్డి గారు తెలుగు నేలను మరొక 2౦ సంవత్సరాలు ఏకదాటిగా పాలించే వారు.ఇది ఆయన బుద్ది బలం.కాని ఏమి జరిగింది చివరకు?

  భగవంతుడి ఆలోచన వేరుగా ఉంది. తెలుగు నేల మీద ఏదో ఒక కొత్త శక్తి రావాలనో,లేక రోశయ్య,కిరన్ కుమార్ రెడ్డి గార్ల జాతక చక్రంలో ముఖ్య మంత్రి యోగం ఉండటం వలనో,అయన మార్గంలోకి "పావురాల గుట్ట"ను(రాజశేఖర్ రెడ్డిగారు ప్రమాదానికి గురి అయిన హెలికాప్టర్ ను డీ కొట్టింది "పావురాల గుట్ట" యే’) అడ్డంగా పెట్టాడు.కనిసం అయన కొడుకునైనా వెంటనే సింహాసనం మీద కూర్చో బెట్టాడ అంటే అదీ లెదు తీసుకెళ్లి జైలులో కూర్చో బెట్టాడు. పాపం ఇంటిల్లి పాదిని,ఎప్పుడు ఎండ ముఖం ఎరుగని పిల్లల్ని ఎండలో త్రిప్పి హింసిస్తున్నాడు. ఇదీ ఆయన రాత!అసలు ఆ భగవంతుడి ఉద్దేశ్యం ఏమిటి? కాలం మాత్రమె సమాదానం చెప్పగలదు.మనం ఊహించినా వేస్టే.ఎందుకంటే మన ఊహకందనివే కదా దైవ లీలలు!.     

No comments:

Post a Comment